Header Banner

సితార టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్! మహేష్ బాబు ప్లానింగ్ వేరే లెవెల్ గురూ.. ఇదే విషయాన్ని నమ్రత కూడా..

  Sat Apr 19, 2025 13:49        Entertainment

చిన్న వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మహేష్ బాబు కూతురు సితార. సోషల్ మీడియాలో డ్యాన్స్‌లు, డైలాగ్ వీడియోలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ సినిమాల్లోకి రాకముందే తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. సితార వయస్సు ఇప్పుడు కేవలం 12 సంవత్సరాలే అయినా సోషల్ మీడియాలో బిగ్ సెన్సేషన్‌గా మారింది. సితార క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే ఒకసారి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై కనిపించి అతి చిన్న వయసులో ఆ అవకాశం దక్కించుకున్న స్టార్ కిడ్‌గా చరిత్ర సృష్టించింది. తండ్రికి తగ్గ వారసురాలిగా మహేష్ బాబు పేరు నిలబెడుతూ ముందుకు సాగుతోంది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పటికే సితారకు కొన్ని బ్రాండ్స్ నుంచి యాడ్స్ ఆఫర్లు కూడా వచ్చాయి. మహేష్ బాబు లేకుండానే కొన్ని యాడ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా సితారను ఎంచుకున్న కంపెనీలు ఉన్నాయి. రీసెంట్ గా తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ బ్రాండ్ యాడ్‌లో నటించింది. ఆ యాడ్‌ ను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మధ్య ఆమె ఫొటోస్ మరింత ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ఇక ఇప్పుడు అందరి మనసులో సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న మొదలైయింది. ఇటీవల ఈ ప్రశ్నకి సమాధానం చెప్పింది సితార. తన తల్లి నమ్రత శిరోద్కర్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు సితార. అక్కడ మీడియా వారు సితార ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న అడగగా, ఆమె తెలివిగా సమాధానం చెప్పింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణకు 7 రోజులు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!

 

ప్రస్తుతం నా వయసు 12 సంవత్సరాలే. ఈ విషయం గురించి ఆలోచించడానికైనా నాకు ఇంకా చాలా టైమ్ ఉంది అని చెప్పింది. ఇదే విషయాన్ని నమ్రత కూడా చెప్పింది. ఇంకా చాలా టైమ్ ఉంది, ప్రస్తుతానికి చదువులు, బ్రాండింగ్‌పై బిజీగా ఉంది సితార అని చెప్పుకొచ్చింది. కాగా.. మూడేళ్ల క్రితం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్నీ’ సాంగ్‌లో మెరిసింది సితార. అలాగే ఫ్రోజెన్ 2 అనే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీకి తెలుగు డబ్బింగ్ చెబుతూ బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఇచ్చింది. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చిన తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అయిన కోటి రూపాయలని విరాళంగా ఇచ్చి, చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంది సితార. ఇదంతా పక్కనబెడితే సితార సినీ ఎంట్రీపై మహేష్ బాబు బిగ్ ప్లాన్ చేశారనేది లేటెస్ట్ టాక్. దర్శకధీరుడు రాజమౌళితో తాను చేస్తున్న SSMB29 మూవీతో సితార సినీ ఎంట్రీ జరగాలనే కోణంలో ఆలోచిస్తున్నారట. ఈ విషయాన్ని జక్కన్నకు కూడా చెప్పడంతో ఆయన సినిమా కోసం ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ సిద్ధం చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. ఏమేదైనా రాజమౌళి లాంటి డైరెక్టర్ తో సితారను వెండితెరకు పరిచయం చేపించడం అనేది మహేష్ బాబు చేసిన గొప్ప ఆలోచనే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్న మాటే తప్పితే దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MaheshBabu #Tollywood #Sitar #ViralNews #TollywoodEntry #CrazyPlan